ప్రభుత్వం ఉండి ఉపయోగం ఏంటి.. చంద్రబాబు మండిపాటు..!

Friday, August 7th, 2020, 02:10:35 PM IST

ఏపీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతూ పోతున్నాయి. ప్రతి ఒక్కరికి సరైన వైద్యం అందాలని జగన్ ప్రభుత్వం చెబుతున్నా క్షేత్ర స్థాయిలో ఆ దాఖలాలు కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఏపీలో వైద్య పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో చూడండి అంటూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఓ వీడియో ట్వీట్ చేశాడు.

ఎంతో భవిష్యత్తు ఉన్న 30 ఏళ్ల యువకుడు తల్లిని కాపాడమంటూ, తన ప్రాణాలు నిలపమంటూ హృదయవిదారకంగా వేడుకుంటున్నా ఎవరూ పట్టించుకోవట్లేదంటే ప్రభుత్వం ఉండి ఉపయోగం ఏంటి అని ప్రశ్నించారు. శ్రీకాకుళం రిమ్స్ లోని ఈ పేషంట్‌లను తక్షణం ఆదుకోండని అన్నారు.