జగన్‌ ప్రభుత్వం బలవంతపు ఏకగ్రీవాలకు పిలుపునిచ్చింది – చంద్రబాబు

Friday, February 12th, 2021, 01:10:52 AM IST


వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి మండిపడ్డారు. నేడు మీడియాతో మాట్లాడిన చంద్రబాబు గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం కోసమే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని, స్థానిక ఎన్నికల నిర్వహణ ద్వారా ఆర్థిక సంఘం నిధులు వస్తాయని అన్నారు. జగన్‌ ప్రభుత్వం బలవంతపు ఏకగ్రీవాలకు పిలుపునిచ్చిందని అయినప్పటికి చాలా గ్రామాల్లో బలవంతపు ఏకగ్రీవాలను ప్రజలు తిరస్కరించారని అన్నారు.

అంతేకాదు ఎన్నికల్లో అవకతవకలు, దౌర్జన్యాలకు పాల్పడడమే కాకుండా పోలీసు వ్యవస్థను కూడా వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ అభ్యర్థులపై తప్పుడు కేసులు పెడతామంటూ వైసీపీ నేతలు బెదిరించారని అన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడడమే కాకుండా, ఎన్నికల ప్రక్రియను టీడీపీ నిరంతరం పర్యవేక్షిస్తుందని చంద్రబాబు అన్నారు.