వేధింపులకు కేరాఫ్ అడ్రస్‌గా వైసీపీ మారింది – చంద్రబాబు నాయుడు

Wednesday, February 3rd, 2021, 12:21:45 AM IST


వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు నాయుడు పంచాయితీ ఎన్నికలలో తొలివిడత నామినేషన్లు భారీగా దాఖలవడంతో జగన్ రెడ్డి ఖంగుతిన్నారని అన్నారు. బలవంతపు ఏకగ్రీవాలు చేయాలన్న వైసీపీ కుట్రలను ప్రజలే భగ్నం చేశారని చెప్పుకొచ్చారు.

అయితే పంచాయితీ ఎన్నికలలో టీడీపీ నేతలు పట్టుదలగా పోటీలో కొనసాగండని, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండని దిశా నిర్దేశం చేశారు. అయితే ఎన్నికలు జరిగితే ఓడిపోతామనేదే వైసీపీ భయమని, ఓటమి భయంతోనే టీడీపీ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందని అన్నారు. ప్రజల కోసమే వీటన్నింటినీ భరిస్తున్నామని, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పోరాడుతున్నామని అన్నారు. పోలీసులు లేకుండా జనంలోకి రాలేని పరిస్థితి వైసీపీది అని తమ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలతోనే అన్ని వర్గాల ప్రజలకు వైసీపీ దూరమైందని అన్నారు.