గంటకో అత్యాచారం, పూటకో హత్య.. జగన్ సర్కార్‌పై చంద్రబాబు కామెంట్స్..!

Tuesday, December 22nd, 2020, 11:00:35 PM IST

వైసీపీ ప్రభుత్వంపై జగన్ సర్కార్ మరోసారి మండిపడ్డారు. నేడు 175 నియోజకవర్గాల టీడీపీ ఇన్‌ఛార్జ్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 20 నెలల ఉన్మాది పాలనలో ప్రజలకు వేధింపులు తప్పా ఏమీ లేదని అన్నారు. వైసీపీ అజెండా అంతా ప్రజల్ని వేధించడమే ఉందని, దాడులు, దౌర్జన్యాలతో బెంబేలెత్తించారని అన్నారు.

అంతేకాదు ప్రశ్నించిన ప్రతిఒక్కరిపై దాడికి తెగబడ్డారని, ప్రజల్ని దోచుకోవడమే లక్ష్యంగా, ప్రజల్ని మభ్యబెట్టడమే వైసీపీ ధ్యేయమని అన్నారు. గంటకో అత్యాచారం, పూటకో హత్యగా నేరగాళ్ల అకృత్యాలు పెరిగిపోతున్నాయని అన్నారు. ఇన్ని జరుగుతున్నా వైసీపీ ప్రభుత్వం కనీసం స్పందించిన పాపాన పోలేదని అన్నారు. వైసీపీ దుర్మార్గాలపై తెలుగుదేశం పార్టీ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని, వైసీపీ వైఫల్యాలపై ప్రజలంతా నిలదీయాల్సిన సమయం ఆసన్నమయ్యిందని అన్నారు.