కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు.. జగన్‌పై చంద్రబాబు కామెంట్స్..!

Tuesday, February 2nd, 2021, 03:00:01 AM IST


ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేస్‌కు నిరాశే మిగిలిందని, రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో జగన్‌ సర్కార్ విఫలమైందని చంద్రబాబు అన్నారు. 23 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతానని ప్రగల్భాలు పలికి ఇప్పుడు కనీసం కేంద్రాన్ని అడిగే సాహసం కూడా చేయడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అంతేకాదు ఏపీకి ప్రత్యేక హోదా, ఆర్థిక లోటు భర్తీ, అమరావతి, పోలవరానికి నిధులు ఇవ్వలేదన్నారు. సీఎం జగన్‌ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని, తనపై ఉన్న కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. 28మంది ఎంపీలను తన కేసుల మాఫీ కోసం వాడుతున్నారే తప్పా ప్రజల కోసం, రాష్ట్రం కోసం కాదని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.