ఏపీని పట్టి పీడిస్తున్న డేంజరస్ వైరస్ జగనే – చంద్రబాబునాయుడు

Tuesday, November 3rd, 2020, 07:00:12 PM IST

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ అధినేత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా 175 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, టీడీపీ ప్రజా ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు ఏపీనీ పట్టి పీడిస్తున్న డేంజరస్ వైరస్ సీఎం జగనే అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు ఫేక్‌న్యూస్‌నే నిజాలుగా నమ్మింప చేయడంలో జగన్ ఘనుడని అన్నారు. పేరుమోసిన క్రిమినల్స్‌తో కేసులు వేయించడం, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేసి ఇతరులపై బురద జల్లడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిపోయిందని ఆరోపించారు. క్రిమినల్స్‌ను అడ్డం పెట్టుకుని భయానక వాతావరణం సృష్టిస్తున్నారని, కులం, మతం విద్వేషాలు రగిలించడంలో జగన్ ఆరితేరారని అన్నారు. సొంత ఇల్లు అనేది ప్రతి పేద కుటుంబం కల అని పేదల సొంతింటి కల నెరవేర్చడానికి టీడీపీ ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు. అయితే టీడీపీకి మంచి పేరు వస్తుందన్న అక్కసుతోనే వైసీపీ దానిని నాశనం చేయాలన్న లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.