వారిని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నా – చంద్రబాబు

Monday, February 1st, 2021, 03:11:40 PM IST

కుప్పం సమీపం లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పై తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. కుప్పం సమీపం లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో ఆరుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి అన్న వార్త విని తీవ్ర దిగ్భ్రాంతి కి గురి అయ్యా అంటూ చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు నాయుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించి ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నా అంటూ చంద్రబాబు నాయుడు అన్నారు.అయితే చంద్రబాబు నాయుడు చేసిన ఈ పోస్ట్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు.

కొందరు ఈ విషయం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందుకు కారణం వైసీపీ అంటూ టీడీపీ కి చెందిన అభిమానులు కమెంట్స్ చేస్తున్నారు. జగన్ ప్రభుత్వమే కారణం అని, రోడ్డు మరమ్మత్తులు చేపట్టకపోవడం, భద్రతా వైఫల్యం, శాంతి భద్రతల పై దృష్టి సారించకపోవడం అంటూ చెప్పుకొచ్చారు. మరి కొందరు మాత్రం 40 ఏళ్ల చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం ఇదేనా అంటూ విమర్శలు చేస్తున్నారు. ప్రమాదం జరిగితే వెళ్లి పరామర్శించకుండా, ట్విట్టర్ లో సానుభూతా అంటూ సెటైర్స్ వేశారు. దశాబ్దాలు గా కుప్పం లో గెలిచి ఏం చేశారు అని, అందుకే ఈ గతి పట్టింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.