ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

Thursday, January 14th, 2021, 08:39:48 AM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది మిగిల్చిన చీకట్లు, ఇక్కట్లు తొలగిపోయి ప్రతి తెలుగు లోగిలి లోకి సంతోష ఐశ్వర్యాలతో కూడిన క్రాంతి సంక్రమించాలని కోరుకుంటూ ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అని తెలిపారు. శుభాలతో కూడిన భవిష్యత్ ను అందించాలని చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేస్తూ, ప్రజలకు విషెష్ తెలిపారు.