చినబాబుకు సరే బాలయ్య బాబు సంగతేమిటి..?

Tuesday, April 5th, 2016, 05:45:54 PM IST


ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ముందున్న లక్ష్యాల్లో కొత్త రాష్ట్రానికి కొత్త రాజధానిని నిర్మించడం ఒకటైతే.. రెండవది పార్టీలో తన వారసత్వాన్ని బలోపేతం చేసుకోవడం. ఈ దిశగా చంద్రబాబు బాగానే కష్టపడుతున్నారు. పార్టీలో నారా లోకేష్ కు ఎటువంటి ఇబ్బందులు, పోటీలు ఎదురుకాకుండా చూసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళుతున్నారు. ఇందులో భాగంగానే త్వరలో చినబాబు లోకేష్ కు మంత్రి పదవి కట్టబెట్టాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే జాతీయ కార్యదర్శిగా పార్టీలో కీలక భాద్యతలు నిర్వహిస్తున్న లోకేష్ ప్రత్యక్ష ఎన్నికలో పాల్గొనలేదు. కాబట్టి త్వరలో రాష్ట్రంలోని ఏదో ఒక నియోజకవర్గాన్ని ఆయనకు కేటాయించి మంత్రిని చెయ్యాలని భావిస్తున్నారు చంద్రబాబు. దీంతో భవిష్యత్తులో లోకేష్ ముఖ్యమంత్రిగా ఎదగడానికి మార్గం సులువవుతుందని ఆయన ప్లాన్. ఇకపోతే పార్టీలో మరో కీలక వ్యక్తి బాలకృష్ణకు క్యాబినెట్ లో చోటు కల్పించే విషయంలో ఇంతవరకూ ఎలాంటి సమాచారమూ బయటకు రాలేదు. ఒకవేళ బాలయ్య మంత్రిగా మారితే సీఎం రేసులో లోకేష్ కు పోటీగా మారడం ఖాయం. ఈ పరిణామం బాబుకు కూడా తెలుసు. కాబట్టి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.