అమిత్ షా కి చంద్రబాబు ఫోన్… అసలు కారణం ఇదే!

Thursday, September 3rd, 2020, 02:12:24 AM IST


ఇటీవల కరోనా వైరస్ భారిన పడి కోలుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారికి తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. ఆసుపత్రి లో చికిత్స పొందిన అనంతరం కోలుకొని ఇంటికి వచ్చారు. అయితే ఈ నేపధ్యంలో అమిత్ షా ఆరోగ్యం పై చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ప్రస్తుతం ఆరోగ్యం బావుంది అని, క్రమంగా పరిస్థితి ఇంకా మెరుగు అవుతుంది అని అన్నారు.

ఇప్పటికే భారతదేశం లో భారీ గా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రోజుకి వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. దీని పై ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అని సూచిస్తున్న సంగతి తెలిసిందే. అయితే భారత్ లో ఒక పక్క కరోనా వైరస్ రికవరీ రేటు రోజురోజుకీ పెరుగుతోంది. కరోనా వైరస్ మరణాల రేటు తక్కువగానే ఉంది అని చెప్పాలి.