చంద్రబాబు నాయుడు సరికొత్త ప్లాన్ – అస్సలే తగ్గట్లేదుగా…?

Thursday, February 13th, 2020, 07:58:13 PM IST

ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చాలా దారుణమైన ఓటమిని కూడగట్టుకున్న తెలుగుదేశం పార్టీ, పార్టీ నేతలు కూడా అప్పటినుండి ఒకరకమైన సందిగ్దానికి లోనవుతున్నారనే చెప్పాలి. అయితే ఎన్నికల ఓటమితో ఒక రకమైన అవమానాన్ని కూడా మూటగట్టుకున్న టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల సమయానికి ఎలాగైనా సరే గెలవాలనే ఉద్దేశంతో ఇప్పటినుండే ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే అందుకు గాను ఒక ఎన్నికల వ్యూహకర్తను కూడా నియమించుకున్నారని సమాచారం.

కాగా దేశంలోని నంబర్ వన్ ఎన్నికల వ్యూహకర్తగా పేరు తెచుకున్నటువంటి ప్రశాంత్ కిషోర్ కి అత్యంత సన్నిహితుడు, ఆయన నేతృత్వంలోని సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ వంటి సంస్థల‌కు వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న రాబిన్ శర్మను టీడీపీ అధిష్టానం నియమించుకుంది సమాచారం. కాగా ఈ కొత్త ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ ఇప్పటికే తన బృందంతో రంగంలోకి దిగారు. అంతేకాకుండా ఏపీలో మరికొద్ది రోజుల్లో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటినుండే పనులు కూడా ప్రారంభించారని సమాచారం. ఒకవేళ అన్ని కుదిరితే చంద్రబాబు కి త్వరలోనే రాబిన్ శర్మ ఎన్నికలకు సంబంధించి ఒక నివేదికను కూడా అందించనున్నారని సమాచారం.