టీడీపీ నేతలకు చంద్రబాబు నాయుడు కీలక సూచన!

Tuesday, August 4th, 2020, 09:06:07 PM IST


తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైసీపీ నేతలకు, రాష్ట్ర ప్రభుత్వానికి అసెంబ్లీ ను డిమాండ్ చేసి మళ్లీ ఎన్నికలకు రావాలి అంటూ చేసిన సవాల్ పై ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరూ సిద్దంగా లేరు అని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఏపీ అసెంబ్లీ రద్దు సవాల్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటూ టీడీపీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి 175 నియోజక వర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థుల తో చంద్రబాబు ఆన్లైన్ సమావేశం నిర్వహించారు.

అయితే చంద్రబాబు నాయుడు ఈ సమావేశం లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అసెంబ్లీ రద్దు సవాల్ పై చర్చ జరిపారు. అయితే దళితుల పై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాల పై ప్రశ్నించాలి అని అన్నారు. కల్తీ మద్యం పై కూడా వైసీపీ తీరు ను ప్రశ్నించాలి అని అన్నారు. చంద్రబాబు విసిరిన సవాల్ పై ఇప్పటి వరకు వైసీపీ నేతలు విమర్శలు మాత్రమే చేశారు. ఏ ఒక్కరూ కూడా సవాల్ కి సిద్దం అంటూ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే చంద్ర బాబు నాయుడు తీరు పట్ల వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.