మీ కుట్రలను సహించేది లేదు జాగ్రత్త.. వైసీపీకి చంద్రబాబు వార్నింగ్..!

Tuesday, January 5th, 2021, 12:39:19 AM IST


ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై ట్విట్టర్ వేదికగా స్పందించిన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రామతీర్థం ఘటనలో అసలు దోషులను పట్టుకోడం మానేసి అమాయకుడైన రామభక్తుడు సూరిబాబును తప్పు ఒప్పుకోవాలంటూ హింసించడం, తెల్లకాగితాలపై సంతకాలు తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు.

అంతేకాదు అధికారులు కోరితే ప్రమాదకరమైన బావిలోకి దిగి సహకరించినందుకు అతనికి, అతని కుటుంబానికి మీరు ద్రోహం చేస్తారా అని ప్రశ్నించారు. నేరాన్ని తెలుగుదేశం మీదికి నెట్టాలనుకునే కుట్రలను సహించేది లేదు జాగ్రత్త అని హెచ్చరించారు. వైసీపీ వాహనంపై ఎవరో వాటర్ ప్యాకెట్లు వేస్తే, తెలుగుదేశం కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెట్టడం సిగ్గుమాలిన చర్య అని, పోలీసులూ! ప్రభుత్వం చెప్పిన దాన్ని గుడ్డిగా అనుసరిస్తూ, దేవుడి విషయంలో పాపం మూటకట్టుకోవద్దని సూచించారు.