ఆ నేతలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పచెప్పిన చంద్రబాబు..!

Wednesday, December 23rd, 2020, 11:00:15 PM IST


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీనీ బలోపేతం చేసే నేపధ్యంలో పార్టీలోని కొంతమంది సీనియర్లకు మరికొన్ని కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శులుగా ఉన్న ఐదు మందికి మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలను 5 జోన్లుగా విభజించి ఒక్కొక్కరికి 5 లోక్‌సభ నియోజకవర్గాల చొప్పున ప్రత్యేక బాధ్యతలను ఇచ్చారు. ఈ క్రమంలో బుద్దా వెంకన్నకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అరకు బాధ్యతలు ఇవ్వగా, పంచుమర్తి అనురాధకు కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, ఏలూరు బాధ్యతలు అప్పగించారు.

ఇక అనగాని సత్యప్రసాద్‍కు ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట బాధ్యతలు, చెంగల్రాయుడికి విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల బాధ్యతలు, అమర్‍నాథ్‍రెడ్డికి కడప, అనంతపురం, హిందూపురం, కర్నూలు, నంద్యాల బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉంటే పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమకు ఇతర రాజకీయ పార్టీలతో సమన్వయ బాధ్యతలు చూసే పనిని, పయ్యావుల కేశవ్‍కు అధికార ప్రతినిధులపై పర్యవేక్షణ బాధ్యతలను, ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామికి 25 లోక్‍సభ స్థానాల నుంచి వచ్చే నివేదికలు పరిశీలించే బాధ్యతలను అప్పగించారు.