స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దంగా ఉండండి.. చంద్రబాబు పిలుపు..!

Tuesday, November 24th, 2020, 07:35:03 PM IST

ఏపీలో కరోనా కారణంగా వాయిదాపడ్డ స్థానిక ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించబోతున్నట్టు ఇటీవల ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ప్రభుత్వానికి, నిమ్మగడ్డకు మధ్య తీవ్ర వాగ్వాదం నడుస్తుంది. ఇలాంటి సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు, నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.

నేడు టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు వైసీపీపై నిప్పులు చెరిగారు. పేదల సొంతింటి కలను వైసీపీ ప్రభుత్వం భగ్నం చేస్తోందని, టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లన్నటిని పేదలకు ఇవ్వకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరిగితే గెలవలేమని వైసీపీ భయపడుతుందని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలలో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని చెప్పుకొచ్చారు. వైసీపీని వదిలించుకోకపోతే రాష్ట్రానికి పట్టిన పీడ వీడదని చంద్రబాబు మాట్లాడారు.