బిగ్ న్యూస్: వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

Wednesday, August 19th, 2020, 12:08:05 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై అధికార, ప్రతి పక్ష పార్టీ నేతలు ఒకరు పై మరొకరు ఘాటు విమర్శలు చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ప్రధాని కి లేఖ రాసిన సంగతి తెలిసింది. అయితే ఈ వ్యవహారం పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డీజీపీ స్పందించడం పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొకసారి వైసీపీ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలు ఇవ్వాలని డీజీపీ లేఖ రాయడం విడ్డూరం అని అన్నారు. మోడీ కి లేఖ రాస్తే, డీజీపీ స్పందించడం విచిత్రం అని, ప్రతి పక్ష నేతల పై దాడులు, తప్పుడు కేసుల పై గతంలో డీజీపీ కి లేఖ రాసిన విషయం ను వెల్లడించారు.

అయితే గతంలో డీజీపీ చర్యలు ఏమి తీసుకోలేదు అని పరోక్షంగా అంటూనే, ఎటువంటి చర్యలు తీసుకున్నారు అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే చంద్రబాబు ను విశాఖ,ఆత్మకూరు పర్యటనలకు అడ్డుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అలా ఆపడం ఏమిటి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు వైసీపీ పై సంచలన ఆరోపణలు చేశారు. గతంలో మాత్రమే కాక ఇపుడు వైద్యుల ఫోన్ లను కూడా ట్యాపింగ్ చేసే దుస్థితి నెలకొంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకి వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.