ప్రజలను మోసగించడం, రాష్ట్రాన్ని దగా చేయడం తప్ప జగన్ చేసిందేమీ లేదు

Wednesday, February 3rd, 2021, 03:46:09 PM IST

ఆంధ్ర ప్రదేశ్ వైసీపీ ప్రభుత్వం పై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం లో ఎన్నికలు ప్రశాంతంగా జరగడం సీఎం జగన్ కి ఇష్టం లేదు అని చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైసీపీ కి చెందిన నేతలు రెచ్చగొట్టి ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు అంటూ చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వారు తప్పుడు కేసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు.అయితే వైసీపీ బెదిరింపులకు లొంగకుండా నామినేషన్లు వేస్తున్న వారి ను అభినందించారు. అయితే ప్రజాస్వామ్యం ను నిలబెట్టాలని తెలుగు దేశం పార్టీ చూస్తుంటే, ధ్వంసం చేయాలని వైసీపీ చూస్తోంది అంటూ తెలుగు దేశం పార్టీ నేతలతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

అయితే ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి పై పలు వ్యాఖ్యలు చేశారు. ప్రజలను మోసగించడం, రాష్ట్రాన్ని దగా చేయడం తప్ప జగన్ చేసిందేమీ లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్ లో ఏపీ కి ఎటువంటి కేటాయింపులు కూడా జరగలేదు. ఈ మొత్తం వ్యవహారం పై ఒక్క ముక్కలో జగన్ పై విమర్శలు చేశారు. రాష్ట్రానికి నిధులు తీసుకు రావడం లో సీఎం జగన్ విఫలం అయ్యారు అని, తన పై ఉన్నటువంటి కేసుల మాఫీల కోసం తన ఎంపీ లను తాకట్టు పెట్టారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.