2022 లో జమిలి ఎన్నికలు వస్తాయి – చంద్రబాబు

Saturday, October 3rd, 2020, 12:13:00 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనా విధానం పై తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసుల మాఫీ కోసమే సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్రం చెప్పినట్లు ఆడుతున్నారు అని ఆరోపణలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగకుండా, రాష్ట్రాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి తాకట్టు పెడుతున్నారు అంటూ మండిపడ్డారు.

అయితే పార్టీ లోని కీలక నేతల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు. 2022 లో జమీలి ఎన్నికలు వస్తాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు తెలుగు దేశం పార్టీ శ్రేణులు సిద్దం గా ఉండాలి అని తెలిపారు. వైసీపీ అధికారం చేపట్టాక అమరావతి లో లక్షల కోట్ల రూపాయల సంపదను విద్వంసం చేశారు అని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మీటర్ల పేరుతో రైతులకు ఉరి తాడు బిగిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 17 నెలల వైసీపీ పాలన లో ప్రజలను నష్టపరిచారు అని, నేతలు దోచుకున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి వీటి పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.