అన్యమతస్థుడైన సీఎం డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి – చంద్రబాబు

Wednesday, September 23rd, 2020, 02:01:20 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రస్తుతం అధికార పార్టీ తీరు పై బీజేపీ, టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. మరీ తిరుమల డిక్లరేషన్ వ్యవహారం లో పెద్ద దుమారమే రేగుతోంది. అయితే ఈ వ్యవహారం పై కొడాలి నాని సైతం చేసిన వ్యాఖ్యలను టీడీపీ, బీజేపీ నేతలు తప్పుబట్టారు. అయితే ఈ డిక్లరేషన్ వ్యవహారం పై తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు.

అయితే అన్యమతస్తుడైన ముఖ్యమంత్రి డిక్లేర్ ఇస్తే తప్పేంటి అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్ కోసం పట్టుబట్టాలనీ నేతలకు చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. టీడీపీ కీలక నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరన్స్ లో చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాక అన్యమతస్థులు డిక్లరేషన్ ఇచ్చాకే తిరుమల ఆలయంలో అడుగు పెట్టాలి అంటూ చంద్రబాబు నాయుడు ఈ మేరకు డిమాండ్ చేశారు. అయితే బ్రహ్మొత్సవాల్లో ఒంటరిగా పట్టు వస్త్రాలు ఇస్తే రాష్ట్రానికే అరిష్టం అంటూ చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేయాలని వైసీపీ నేతలు చూస్తున్నారు అంటూ చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.