రాజకీయం చేస్తే తిరుగుబాటు తప్పదు…జగన్ సర్కార్ కి చంద్రబాబు హెచ్చరిక!

Tuesday, August 25th, 2020, 02:05:37 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో అతి భారీ వర్షాలు కురవడం తో ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారు. అయితే వడలతో నష్టపోయిన కుటుంబాలకు పది వేల రూపాయలకు పైగా అందజేయాలని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఇల్లు కోల్పోయిన వారికి నిర్మించి ఇవ్వాలి అని అన్నారు. రెండు వారాలు దాటుతున్నా గోదావరి వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని ఘాటు విమర్శలు చేశారు.

అయితే వైసీపీ మద్దతు దారులకు మాత్రమే అండగా ఉంటామని ప్రభుత్వం భీష్మించుకు ని కూర్చుంటే తిరుగుబాటు తప్పదు అని హెచ్చరించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయాలు, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఉండటం వలన ప్రజలకి ఈ దుస్థితి పట్టింది అని అన్నారు. సరైన సమయంలో ప్రాజెక్ట్ ల నుండి నీటిని వదలడం లో ప్రభుత్వం విఫలం అయింది అని ఆరోపించారు. అయితే ఇటువంటి క్లిష్ట సమయంలో బాధితులకి సహాయం చేయకుండా రాజకీయం చేస్తే మాత్రం తిరుగుబాటు తప్పదు అని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకి వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.