ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనేది ప్రజలే గ్రహించాలి – చంద్రబాబు

Monday, August 10th, 2020, 11:07:22 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ను ప్రశ్నిస్తూ నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సమగ్రాభివృద్ధికి టీడీపీ నాంది పలికింది అని చంద్రబాబు అన్నారు. అన్ని జిల్లాల అభివృద్ది లక్ష్యం గా దూసుకెల్లాం అని, ఈ మేరకు టీడీపీ పాలన లో చేసిన పలు విషయాలను వెల్లడించారు చంద్రబాబు.

నదుల అనుసంధానం, ఈజ్ ఆఫ్ డూ ఇంగ్ బిజినెస్ లో రాష్ట్రాన్ని ప్రథమ స్థానాన్ని తీసుకొచ్చాం అని అన్నారు. పారిశ్రామిక రంగం లో సైతం అగ్రగామిగా నిలిచామని చంద్రబాబు నాయుడు అన్నారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించామని, అన్ని రంగాల్లో తక్కువ కాలం లోనే వృద్ది సాధించాం అని అన్నారు. అయితే ఈ 14 నెలల్లో మీరేం చేశారో చెప్పగలరా అంటూ చంద్రబాబు నాయుడు సూటిగా రాష్ట్ర ప్రభుత్వం ను ప్రశ్నించారు. ఏది వాస్తవమో, ఏది అవస్తవమో ప్రజలే గ్రహించాలి అంటూ చంద్రబాబు అన్నారు. తాము 13 జిల్లాల అభివృద్ది చేసిన విషయాన్ని తెలిపారు.తమ పాలన లో 62 ప్రాజెక్టులకు నాంది పలికితే పూర్తి చేయకుండా,కాలయాపన చేస్తుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.