బిగ్ న్యూస్: 48 గంటల సమయం ఇస్తున్నా అసెంబ్లీ ను రద్దు చేయండి – చంద్రబాబు

Monday, August 3rd, 2020, 10:24:46 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల చంద్రబాబు నాయుడు ఉగ్ర రూపం దాల్చి ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ ను నాశనం చేసే అధికారం ఎవరికీ లేదు అని అన్నారు. ఈ రాజధాని సమస్య అనేది ఏ ఒక్కరి సమస్య అనేది కాదు అని, అయిదు కోట్ల ప్రజలది అని అన్నారు. అయితే ఎన్నికల ముందు రాజధాని గురించి ఏ మాత్రం చెప్పకుండా రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టారు అని, అధికారం చేపట్టాక ఇలా చేయడం సరికాదు అంటూ ప్రభుత్వ వైఖరి ను నిలదీశారు.

అయితే ఈ మేరకు రాజదాని వికేంద్రికరణ పై చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల నిర్ణయం సరైనదే అని మీరు భావిస్తే రాజీనామా లు చేసి అందరం ఎన్నికలకు వెళ్దాం అని అన్నారు. అయితే ఈ మేరకు వైసీపీ నేతలకు, ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్ విసిరారు. 48 గంటల సమయం ఇస్తున్నా అసెంబ్లీ ను రద్దు చేయండి అని డిమాండ్ చేశారు. అయితే రాజీనామా లు చేయడానికి టీడీపీ ఎమ్మెల్యే లు సిద్దం అని, మీరు కూడా రాజీనామా లు చేసి రండి, ప్రజల్లో తేల్చుకుందాం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాను విసిరిన సవాల్ ను స్వీకరిస్తారా లేకపోతే ప్రజలకు వెన్నుపోటు పొడుస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు.