అవి దౌర్జన్యాలు, దాడులతో భయపెట్టి చేసే బలవంతపు ఏకగ్రీవాలు

Thursday, January 28th, 2021, 02:11:52 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం పై తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ చెబుతున్నటువంటి ఏకగ్రీవాలు ప్రజల ఆమోదం తో జరిగేవి కాదు అని, అవన్నీ కూడా దౌర్జన్యాలు, దాడులతో భయపెట్టి చేసే బలవంతపు ఏకగ్రీవాలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే ఇటీవల జరిగిన విధ్వంసాలే అందుకు నిదర్శనం అంటూ చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అయితే మీడియా సమావేశం ద్వారా మాట్లాడిన చంద్రబాబు నాయుడు వైసీపీ పై ధ్వజమెత్తారు.

1 కాదు 2 కాదు ఏకంగా వైసీపీ దౌర్జన్యాలతో 2,274 ఏకగ్రీవాలు చేశారు అని సంచలన ఆరోపణలు చేశారు.అయితే అందుకు సంబంధించిన వీడియో లను సైతం చంద్రబాబు నాయుడు ప్రదర్శించారు. అయితే ఏం అభివృద్ధి చేశారు అని ఏకగ్రీవాలు చేయాలని అడుగుతారు అంటూ చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నించారు. వైసీపీ అధికారం లోకి వచ్చి 20 నెలలు అవుతున్నా ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా ఉందా అంటూ సూటీగా ప్రశ్నించారు. అయితే టీడీపీ హయాంలో అనేక రంగాల్లో ఏపీ ను నెంబర్ 1 గా నిలిపాం అని అన్నారు. 25 వేల కిలమీటర్లు రొడ్లేస్తే మీరు ఎన్ని కిలోమీటర్లు రొడ్లేసారు అంటూ చంద్రబాబు నాయుడు వరుస ప్రశ్నలు వేశారు. అంతేకాక అందుకు సంబంధించిన మేనిఫెస్టో ను సైతం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం లో వెల్లడించారు.