ప్రజారోగ్యం మీద శ్రద్ద పెట్టండి…వైసీపీ పాలన పై బాబు సీరియస్ కామెంట్స్

Friday, January 22nd, 2021, 02:40:57 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ప్రజలకు సురక్షిత త్రాగునీరు కూడా ఇవ్వలేక పోతుంది అంటూ బాబు విమర్శించారు. అయితే వైసీపీ పాలన తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ బాబు మండిపడ్డారు. పాలన అంటే ప్రజల జీవితాలను మార్చ గలగాలి కానీ, వైసీపీ పాలన లో ప్రజలు తాము ప్రాణాలతో ఉంటే చాలు అనుకునే పరిస్థితుల్లో ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి జాతీయ స్థాయిలో సంచలనం అయ్యే సరికి నాలుగు రోజులు హడావిడి చేసి వదిలేశారు అంటూ విమర్శలు గుప్పించారు.

అయితే అదే వింత వ్యాధి ఇప్పుడు దెందులూరు కి చేరుకుంది అని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక అక్కడ డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉందని ప్రజలు చెబుతున్నారు అంటూ చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అయితే పాలకులు కుట్ర రాజకీయాలు, వ్యవస్థలు నాశనం చేయడం వంటి వాటి పై శ్రద్ద పెట్టడం కంటే ప్రజారోగ్యం మీద శ్రద్ద వహించాలి అని బాబు హితవు పలికారు. కోమరేపల్లి లో 24 మంది అస్వస్థకి గురి అయ్యారు అంటూ చెప్పుకొచ్చారు.