ఉమా పై భౌతిక దాడికి దిగుతానన్న కొడాలి నాని పై చర్యలు ఉండవా?

Tuesday, January 19th, 2021, 04:34:21 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార పార్టీ వైసీపీ తీరు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల పక్షాన మాట్లాడితే దాడులు చేస్తారా అంటూ చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రోద్బలం తోనే దాడులు జరుగుతున్నాయి అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇలాంటి వాటిని సహించేది లేదు అని, ప్రజల పక్షాన మాట్లాడిన ఉమా ను అరెస్ట్ చేయడం ఏమిటని, ఉమా తో పాటుగా అరెస్ట్ చేసిన టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాలి అంటూ చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. అయితే ఉమా పై ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని పై చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

దేవినేని ఉమా పై భౌతిక దాడికి దిగుతానన్న కొడాలి నాని పై చర్యలు ఉండవా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే అవినీతి, అక్రమాలను కప్పి పుచ్చుకోవడానికి బరి తెగించి తిరుగుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో రాష్ట్రం గూండాలకి అడ్డాగా మారిపోయింది అంటూ చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అయితే రాష్ట్రం లో జరుగుతున్న తాజా పరిణామాల పై ప్రజలు సర్వత్రా చర్చలు జరుపుతున్నారు.