వైసీపీ ప్రభుత్వం పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Saturday, October 10th, 2020, 03:00:41 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రస్తుత పరిణామాల పై, వైసీపీ పాలన పై తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వైసీపీ తీరును ఎండగడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ మరియు కర్నూల్ జిల్లాల కి వైసీపీ చేసింది ఏమీ లేదు అని, తెలుగు దేశం పార్టీ హయాంలో చేసినవే తప్ప కొత్త ప్రాజెక్టులు ఏమి కూడా లేవు అని చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే అమరావతి ఉద్యమం గురించి సైతం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

300 రోజులు పూర్తి అవుతున్న నేపద్యం లో చేపట్టాల్సిన కార్యక్రమాల పై టీడీపీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఏడాదిన్నర పాలన లో జగన్ ప్రభుత్వం రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర లకు ఏం చేశారో చెప్పాలి అని సూటిగా ప్రశ్నించారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక నీటి ప్రాజెక్టులు పూర్తి గా నిలిచి పోయాయి అని ఆరోపించారు. అంతేకాక వచ్చిన కంపనీ లను వాటాల కోసం బెదిరించి తరిమేశారు అని ఆరోపించారు. అయితే తెలుగు దేశం పార్టీ చేసిన శంకుస్థాపన పనులను మళ్లీ వైసీపీ చేస్తోంది అని ఎద్దేవా చేశారు. అయితే టీడీపీ చేసిన అభివృద్ది ను వారు చేసినట్లు చెప్పుకోవడం సిగ్గు చేటు అంటూ ఘాటు విమర్శలు చేశారు.