అన్నీ మరిచి మూడు ముక్కలాట ఆడుతున్నారు – చంద్రబాబు!

Thursday, August 6th, 2020, 03:00:16 AM IST


తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఇపుడు ఏం చేస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ప్రజలను నమ్మించి, ద్రోహం చేసి, వెన్నుపోటు పొడిచారు అని అన్నారు. వైసీపీ నాయకులు ఎలా మాట తప్పారో ప్రజలు అందరూ తెలుసుకోవాలి అని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన కంటే కూడా నేడు పెద్ద అన్యాయం జరుగుతోంది అని చంద్రబాబు నాయుడు అవేదన వ్యక్తం చేశారు.

అయితే నాయకులకు బుద్ది చెప్పే పరిస్తితి రావాలి అని, నాడు అమరావతి కోసం 30 ఎకరాల స్థలం కావాలి అని చెప్పిన మాటలు మరొకసారి చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు.నేడు అన్ని మరిచి మూడు ముక్కలాట ఆడుతున్నారు అని, అమరావతి ను నాశనం చేస్తారు అని ఎన్నికల ముందే చెప్పా అంటూ చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే మీరు చేసే పనులు సరి అయినవే అని అనిపిస్తే మళ్లీ ఎన్నికలకు వెళ్ళాలి అని సవాల్ చేశారు.అయితే దైర్యం ఉంటే ఎన్నికలకు రండి అని, రైతుల తో జరిగిన ఒప్పందం ను కాపాడాలి అని కోరారు. సీఎం జగన్ కి మరొకసారి చంద్రబాబు సవాల్ విసరడం పట్ల వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు విమర్శలు చేస్తున్నారు.