పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి – చంద్రబాబు

Monday, November 30th, 2020, 01:40:42 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెలుగు దేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ సచివాలయం వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు అధ్యక్షతన ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు, పలువురు నేతలు ఈ నిరసన లో పాల్గొన్నారు. చేతిలో వరి కంకులతో నిరసన ర్యాలీ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేల రూపాయల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేశారు. ఉద్యాన పంటలకు 50 వేలు, ముంపు బాధితులకు 10 వేల రూపాయల చొప్పున సహాయం అందించాలి అని అన్నారు.

అయితే అసెంబ్లీ ప్రాంగణం లో వైసీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి టీడీపీ నేతల తీరు పై ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు ఏనాడూ రైతులను ఆదుకోలేదు అని, తుఫాన్ బాధిత రైతులకు పరిహారం సక్రమం గా ఇవ్వలేదు అని పేర్కొన్నారు. అయితే రైతుల ఇన్ పుట్ సబ్సిడీ ఎగవేసిన ఘనత చంద్రబాబు ది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పెట్టిన బకాయిలను సీఎం జగన్ చెల్లించారు అని అన్నారు. అయితే తుఫాన్ వలన మృతి చెందిన వారికి ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు అని, బాధితులకు పరిహారం ఇప్పటికే ప్రకటించారు అని పేర్కొన్నారు. అంతేకాక చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా డ్రామాలు ఆపాలి అంటూ ఘాటు విమర్శలు చేశారు.