టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ ను పరామర్శించిన చంద్రబాబు

Tuesday, February 16th, 2021, 04:00:12 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పారిశ్రామిక రంగం లో కీలక పాత్ర పోషించిన విశాఖ ఉక్కు పరిశ్రమ ను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం కి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు, తెలుగు దేశం పార్టీ నేతలు నిరసన తెలుపుతున్నారు. అయితే ఫిబ్రవరి 10 నుండి ఆమరణ దీక్ష చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న తెలుగు దేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు ను పోలీసులు నగరం లోని ఆసుపత్రికి తరలించారు. అయితే నేడు తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్లా శ్రీనివాస్ రావు ఆమరణ దీక్ష కి సంఘీభావం తెలిపేందుకు రావాల్సి ఉండగా, పోలీసులు దీక్ష భగ్నం చేసి ఆసుపత్రికి తరలించడం తో పరామర్శించేందుకు వెళ్ళారు.

అయితే చంద్రబాబు నాయుడు పరామర్శించిన అనంతరం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయం పట్ల కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పట్ల వ్యాఖ్యలు చేయనున్నారు. కార్మిక సంఘాలను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేయనున్నారు.