వైసీపీ అక్రమాలపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన చంద్రబాబు..!

Thursday, March 4th, 2021, 12:18:56 AM IST


ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీల మధ్య పంచాయితీ ఎన్నికల నుంచి మొదలైన యుద్ధం ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగుతుంది. అయితే చిత్తూర్ కార్పోరేషన్‌లో వైసీపీ అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీకి ఫిర్యాదు చేశారు. అయితే టీడీపీ అభ్యర్థుల సంతకాలను పోలీసు‌లు, ఓ వర్గం అధికారులు ఫోర్జరీ చేసి నామినేషన్ల ఉపసంహరణ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత వైసీపీ నేతలు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని, దీనిపై ఎస్ఈసీ సమగ్ర విచారణ జరిపిన తర్వాతే ఏక్రగీవ ఫలితాలు ప్రకటించాలని చంద్రబాబు ఎస్ఈసీనీ కోరారు.