టీడీపీని అడ్డుకోవడం వైసీపీ తరం కాదు.. పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచన..!

Wednesday, February 24th, 2021, 01:30:40 AM IST


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ శ్రేణుల పోరాటం అభినందనీయమని, సమష్టిగా పోరాడి ఘన విజయాన్ని అందుకున్నామని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని నాయకులకు చంద్రబాబు సూచించారు. పంచాయతీ ఎన్నికల మాదిరిగా ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయడం మున్సిపల్ ఎన్నికల్లో కుదరదని చంద్రబాబు అన్నారు.

అయితే బలవంతపు ఏకగ్రీవాలు, బలవంతపు నామినేషన్ ఉపసంహరణలు, ప్రలోభాలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. కలిసి ముందుకెళ్తే టీడీపీని అడ్డుకోవడం వైసీపీ తరం కాదని చెప్పుకొచ్చారు. వైసీపీ నేతల అక్రమాలను ప్రజలకు వివరించాలని, ప్రశాంతంగా ఉన్న విశాఖను అరాచకానికి చిరునామాగా మార్చారని విమర్శలు గుప్పించారు. వైసీపీ అరాచకాలను ఎదుర్కొనేందుకు టీడీపీయే ప్రత్యామ్నాయమని ప్రజలు భావిస్తున్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.