వైసీపీ హత్యా రాజకీయాలకు ఇవి నిదర్శనాలు

Monday, January 4th, 2021, 09:28:08 AM IST

Chandrababu-Naidu

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ప్రతి పక్ష తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాక వైసీపీ తీరును ఎండగడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికారంలో ఉన్న వైసీపీ ది హత్యా రాజకీయం అని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలిపారు. గురజాల నియోజక వర్గం పెదగార్ల పాడు మాజీ సర్పంచ్ పురంశెట్టి అంకులు హత్య పట్ల టీడీపీ అధినేత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 20 ఏళ్లు సర్పంచి గా ప్రజాసేవ చేసిన అటువంటి వ్యక్తి ను హత్య చేయడం కిరాతక చర్య అంటూ చంద్రబాబు మండిపడ్డారు.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వైసీపీ అధికారంలోకి వచ్చి 19 నెలలు అవుతుంది అని, వైసీపీ పాలనలో 16 మంది కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు లో నందం సుబ్బయ్య, దాచేపల్లి లో అంకుల్ హత్యలు వైసీపీ హత్యా రాజకీయాలకు నిదర్శనం అంటూ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వైసీపీ అధికారంలో కి వచ్చాక హత్యాకాండ పెట్రేగి పోయింది అని, జగన్ అండ చూసుకొని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు అంటూ చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ప్రశాంతంగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి శాంతి భద్రతల ను అధాహ్ పాతాళానికి దిగజార్చారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.