94 శాతం వైసీపీ గెలుచుకుంది అని గాలి కబుర్లు చెబుతారా? – చంద్రబాబు

Wednesday, February 10th, 2021, 03:00:45 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొకసారి వైసీపీ పాలన విధానం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తాజాగా వెలువడిన పంచాయితీ ఎన్నికల ఫలితాలే వైసీపీ ప్రభుత్వం పతనానికి నాంది అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం ఇక్కడి నుండే పతనం అయింది అని చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే 20 నెలల పాలన లో అన్ని ఉల్లంఘనలే అంటూ విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలు అన్ని కూడా దెబ్బతీసే పరిస్థతికి వచ్చారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

అయితే మీడియా సమావేశం లో మాట్లాడిన చంద్రబాబు పలు అంశాల పై ప్రస్తావించారు. అమరావతి, పోలవరం పెట్టుబడులను ధ్వంసం చేశారు అని వైసీపీ ప్రభుత్వం పై ఆరోపణలు చేశారు. విద్వేషాలు, హింస లతో రైతులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు అని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో హింసాకాండ, పెద్ద ఎత్తున మద్యం, డబ్బులు పంపిణీ చేశారు అంటూ చెప్పుకొచ్చారు. టీడీపీ ప్రజల గుండెలో ఉందని, ఎన్ని దుర్మార్గాలు చేసిన అధికార పార్టీ కి ప్రజలు తగిన బుద్ది చెప్పారు అని అన్నారు. అయితే టీడీపీ కి 38.74 శాతం ఫలితాలు అనుకూలంగా వచ్చాయి అని,అయితే వైసీపీ 94 శాతం గెలుచుకుంది అని గాలి కబుర్లు చెబుతారా అంటూ విమర్శలు చేశారు. అంతేకాక టీడీపీ నేతల పై అక్రమ కేసులు పెడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.