జగన్ ప్రోద్బలంతో వారు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు – చంద్రబాబు

Monday, February 8th, 2021, 07:29:24 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయం లో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. అయితే వైసీపీ కి చెందిన నేతలు, పలువురు మంత్రులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రులు వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రతి పక్ష పార్టీ తెలుగు దేశం పార్టీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వైసీపీ వైఖరి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతి ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు అని చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పిస్తున్నారు.

సీఎం జగన్ ఫ్యాక్షన్ సిద్ధాంతం తో రాజ్యాంగ వ్యవస్థలను అపహస్యం చేస్తున్నారు అని, జగన్ ప్రోద్బలంతో నే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లు రాజ్యాంగేతర శక్తులు గా వ్యవహరిస్తూ హింసా రాజకీయాలకు తెరలేపుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే నామినేషన్ వేయాడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులకి రక్షణ కల్పించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎన్నికల సంఘం పై ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు. నామినేషన్ల కి అడ్డుపడితే ఈ మెయిల్ ద్వారా పార్టీ కేంద్ర కార్యాలయంకి, జిల్లా కలెక్టర్ కి, మరియు ఎన్నికల సంఘం కి పంపించాలి అంటూ సూచించారు. అయితే ఎన్నికల నిర్వహణ విషయం లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భయానక వాతావరణం ను సృష్టించారు అని ఆరోపించారు.