ప్రతి రోజు 10 వేల కరోనా కేసులు నమోదవుతుంటే పాటశాలలు ఎలా తెరుస్తారు?

Wednesday, August 26th, 2020, 01:31:44 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార వైసీపీ నేతలు, తెలుగు దేశం పార్టీ నేతల విమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి. తాజాగా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతల గనుల లీజు రద్దు వైసీపీ బ్లాక్ మెయిలింగ్ కు పరాకాష్ట అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రతి రోజూ 10 వేల కరోనా కేసులు నమోదవుతుంటే పాటశాలలు ఎలా తెరుస్తారు అంటూ సూటిగా ప్రశ్నించారు.

పేదలకు గోరంత సహాయం చేసి కొండంత ప్రచారం చేసుకుంటున్నారు అని విమర్శించారు. అరగంట లో కరోనా రోగులకు బెడ్ కేటాయింపు అమలు లో లేదు అని తెలిపారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయం లో కూడా తెలుగు దేశం పార్టీ నేతలకి పలు కీలక సూచనలు చేశారు చంద్రబాబు. రాజధాని పై నిర్వహిస్తున్న ప్రజా అభిప్రాయ సేకరణ లో అందరూ పాల్గొనాలి అని తెలిపారు. ప్రజల అభిప్రాయం తో వైసీపీ కళ్ళు తెరిపించాలని సూచించారు. అయితే చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తూనే ఉన్నారు.