ఆ ఆలోచనలతో వైసీపీ రాత్రిపూట నిద్రకూడా పోతున్నట్టు లేదు – చంద్రబాబు

Saturday, November 7th, 2020, 08:05:58 PM IST

వైసీపీ పాలన విధానం పై, పని తీరు పై, ప్రతి పక్ష నేతల పై వ్యవహరిస్తున్న తీరు పట్ల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతి పక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘాటు విమర్శలు చేశారు. అయితే అధికారం ఉన్నవారు ఎవరైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు రాత్రిపగళ్లు ఆలోచిస్తారు, అధికార యంత్రాంగం ను కూడా ఆ దిశగా ఉత్తేజ పరుస్తారు అని చంద్రబాబు నాయుడు అన్నారు. కానీ, వైసీపీ పాలకుల తీరు వేరు అని, ప్రతి పక్ష నేతల పై కక్ష ఎలా తీర్చుకోవాలన్న అలోచనలతో రాత్రిళ్ళు కూడా నిద్రపోతున్నట్టు లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే అందుకు నిదర్శనమే అర్దరాత్రి అరెస్టులు, చీకట్లో కూల్చివేతలు, పొద్దుపోయాక నోటీసులు ఇవన్నీ అంటూ మండిపడ్డారు. అయితే మాజీ ఎంపీ సబ్బం హరి గారి స్థలంలోనీ నిర్మాణాల కూల్చివేతల పై హైకోర్టు సోమవారం వరకు స్టేటస్ కో విధించింది అని అన్నారు. కానీ ఈ లోపే మూడు రోజుల్లో భవనాలను తొలగించాలి అని ప్రభుత్వం మరో నోటీసును పంపించింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ నోటీసును కూడా రాత్రిపూట ఇంటికి అంటించి పోయారు అని, కక్ష రాజకీయాల కోసం పాలనా యంత్రాంగం ను, వ్యవస్థలను భ్రష్టు పట్టించడం రాష్ట్రానికి చేటు తెస్తుంది అని చంద్రబాబు నాయుడు హితవు పలికారు. న్యాయ స్థానాలలో ఉన్న అంశాల పై ఈ రకంగా స్పందించడం వెనుక వేధింపు లక్ష్యం గా కనిపిస్తుంది అని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.