వైసీపీ పాలనలో ఆర్ధిక అసమానతలు పెరిగాయి – చంద్రబాబు

Thursday, October 29th, 2020, 03:10:25 PM IST

Chandrababu-Naidu

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార పార్టీ పై మరొక్కసారి విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ను తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏపీ లో అధికారం చేపట్టి ఏడాదిన్నర గడవకుండానే ప్రజల పై 60 వేల కోట్ల రూపాయల భారం మోపింది అంటూ విమర్శించారు. కర్నూల్ జిల్లా కీలక టీడీపీ నేతల తో నిర్వహించిన సమీక్షా సమావేశం లో చంద్రబాబు నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ పాలనలో ఆర్ధిక అసమానతలు పెరిగాయి అని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రజల ఆదాయం తగ్గిపోయింది అని, లక్షలాది మంది పేదలకు సంక్షేమాలను దూరం చేశారు అని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్తితి ను విచ్ఛిన్నం చేశారు అని, తెలుగు దేశం పార్టీ మీద ప్రతీకారం తో ప్రజల పై కక్ష సాధింపు చర్యలకు వైసీపీ పాల్పడుతోంది అని ఆరోపించారు.అయితే టీడీపీ అధికారం లో ఉండగా కర్నూల్ జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేసింది అని తెలిపారు. కర్నూల్ జిల్లాకు వైసీపీ చేసింది శూన్యం అని అన్నారు. వైసీపీ అభివృద్ది పనులను నిలిపి వేసింది అని, రాష్ట్రం అప్పుల ఊబి లో కూరుకుపోవడం మాత్రమే కాకుండా, పెట్టుబడులు, పరిశ్రమలు వెళ్లిపోతున్నాయి అని తెలిపారు.