టీడీపీ తలపెట్టిన పాదయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికం – చంద్రబాబు

Monday, October 26th, 2020, 11:49:56 AM IST

తెలుగు దేశం పార్టీ నేతలు తలపెట్టిన పాదయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికం అంటూ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల అరెస్టు ను చంద్రబాబు ఖండించారు. అయితే చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజక వర్గం లో ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను టీడీపీ గర్హిస్తుంది అని చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ నేతల గృహ నిర్భంధం తక్షణమే ఎత్తివేయాలని, అక్రమ కేసులను తొలగించాలని ఈ మేరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.

అయితే హంద్రీ నీవా ఎత్తిపోతల పనుల ను యుద్ధప్రాతపదికన పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. అయితే త్వరితంగా పూర్తి చేసి చిత్తూరు కి నీరు తీసుకు రావాలి అన్ కోరుతూ పాదయాత్ర తలపెట్టిన సంగతి తెలిసిందే. అయితే కుప్పంలో పార్టీ నేతలను, కార్యకర్తలను గృహ నిర్భంధం చేసిన నేపధ్యంలో చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతల ఇళ్ల ముందు పోలీసులు భారీగా మోహరించడం తో పాదయాత్ర కి బ్రేక్ పడింది.