ఏడాదిన్నర పాలనలో ఎన్ని తప్పులు చేయాలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని తప్పులు చేసింది!

Wednesday, September 16th, 2020, 03:00:46 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న పరిణామాల పై తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు అమరావతి భూముల పై ఆరోపణలు చేస్తున్నారు అని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్మార్గుల పాలన లో మంచివాళ్ళకి కలిగే నష్టాలకు మన రాష్ట్రమే ఉదాహరణ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దోపిడీ కి ఇదే చివరి అవకాశం అన్నట్లుగా వైసీపీ బరితెగించింది అని, వైసీపీ దౌర్జన్యాలు పై ప్రజలే తిరగబడే పరిస్తితి వచ్చింది అని, ప్రజల ఆరోగ్యం, పేదల ఉపాది పై రాష్ట్ర ప్రభుత్వం కి లెక్క లేదు అని, దళిత మహిళ ల ప్రాణాలకు రక్షణ లేదు అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అయితే ప్రాథమిక హక్కులను మాత్రమే కాకుండా, జీవించే హక్కులను కూడా వైసీపీ కాల రాస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఏడాదిన్నర పాలనలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని తప్పులు చేయాలో అన్ని చేసింది అని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

ప్రజాస్వామ్యం లో ప్రతి పక్ష పాత్ర ఎంతో కీలక అని, ప్రభుత్వ అవినీతి ను ఎండగట్టాల్సిన బాధ్యత ప్రతి పక్ష పార్టీ దే అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అయితే అలాంటి ప్రతి పక్ష పార్టీ లను పోలీసులు అనిచివేయాలని చూడకూడదు అని, పార్టీలకు అతీతంగా పోలీస్ వ్యవస్థ పనితీరు ఉండాలి అంటూ చంద్రబాబు నాయుడు అన్నారు.అంతేకాక రాష్ట్రంలో జరుగుతున్న దేవాలయాల పై దాడుల మీద సీబీఐ విచారణ జరిపించాలి అని చంద్రబాబు నాయుడు కోరారు.