పాదయాత్రలో ప్రజలకు ముద్దులు…ఇప్పుడు పిడిగుద్దులు

Wednesday, January 13th, 2021, 08:31:32 AM IST

కృష్ణా జిల్లాలోని పరిటాల లో నిర్వహించిన భోగి వేడుకల్లో తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రైతులు ఎక్కడా కూడా ఆనందం గా లేరని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతాం అని చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన బిల్లులను భోగి మంటల్లో వేశారు. అయితే సీఎం జగన్ పాలన విధానం పై చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు.

పాదయాత్రలో ప్రజలకు ముద్దులు పెట్టిన జగన్, ఇప్పుడేమో పిడిగుద్దులు గుద్దుతున్నాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజా వేదికను కూల్చి శాడిస్ట్ లాగా వ్యవహరించాదు అంటూ మండిపడ్డారు. రైతులు ఏడు విపత్తులు వచ్చి నష్టపోయారు అని, అయినా పరిహారం ఇవ్వలేదు అని, అసత్యాలతో రైతులను దగా చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక రైతుల కోసం తాను పోరాడుతుంటే మైనింగ్ మాఫియా, బెట్టింగ్, బూతుల మంత్రులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు అంటూ వైసీపీ నేతల పై దారుణ వ్యాఖ్యలు చేశారు. అయితే పరిటాల పేరు చెప్పగానే కోహినూర్ గుర్తుకు వస్తుంది అని చంద్రబాబు నాయుడు అన్నారు.