గాల్లో తిరిగే ఫేక్ ముఖ్యమంత్రి జగన్ – చంద్రబాబు

Tuesday, January 5th, 2021, 01:16:34 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనా విధానం పై తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.జ్ఞానం లేని ముఖ్యమంత్రి అజ్ఞానం గా వ్యవహరిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం కరోనా వైరస్ ను అరికట్టడం లో తీసుకున్న నిర్ణయాల పై, పని తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రజలందరినీ ఇబ్బంది పెట్టింది అంటూ ద్వజమెత్తారు. అంతేకాక గాలి కబుర్లు, గాలి మాటలు చెబుతూ గాల్లో తిరిగే ఫేక్ ముఖ్యమంత్రి జగన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి పట్ల ప్రజల్లో చైతన్యం రావడం వలన కలిసి కట్టడిగా అరికట్టగలిగాం అని అన్నారు. అయితే భారత్ బయోటెక్ వాక్సిన్ ను కూడా విమర్శించే వాళ్ళు ఉండటం దురదృష్టకరం అంటూ చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వాక్సిన్ ను భారత్ బయోటెక్ తీసుకొస్తుంది అని, ఇది దేశానికే గర్వకారణం అంటూ చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే విజయనగరం జిల్లా రామతీర్థం లో రాముడి విగ్రహం ధ్వంసం ఘటన లో ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహరించింది అంటూ మండిపడ్డారు. వరుస ఘటన ల పై సీబీఐ దర్యాప జరపాలని కోరిన చంద్రబాబు, ఆలయాల పై జరుగుతున్న వరుస దాడులను నిరోధించడం లో ప్రభుత్వం విఫలం అయింది అంటూ ఆరోపించారు.