బిగ్ న్యూస్: సీఎం జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Wednesday, December 2nd, 2020, 01:29:31 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ప్రతి పక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది బాబు స్కీం, ఇది జగన్ స్కీం అంట, ప్రభుత్వం లో బాబు స్కీం, జగన్ స్కీం ఉంటాయా, మళ్ళీ వీటి పై ప్రభుత్వ డబ్బుతో యాడ్స్ ఇచ్చుకుంటారు, ఆడి పేపర్ కి, ఇంకో పేపర్ కి అంటూ చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏమనాలి వీణ్ణి , ఇంగిత జ్ఞానం ఉందా అంటూ సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. క్రాప్ ఇన్సూరెన్స్ ఇప్పుడు కడతామని అంటున్నారు, ఎవరైనా ఒప్పుకుంటారా అని సూటిగా ప్రశ్నించారు.

అయితే ఋణమాఫీ కి 15 వేల కోట్ల రూపాయలే ఇచ్చాం అని మంత్రి అంటాడు, వెనకాల ఎవడో కాదు 12 కొట్లే అంటాడు, వాడి బడ్జెట్ లో 15 కోట్లు అని చెప్పాడు, వీడు ఇదే చెప్తాడు అంటూ చంద్రబాబు రెచ్చిపోయారు. ఒకటిన్నర సంవత్సరం అయింది నువ్వు వచ్చి, నువ్వు ఇవన్నీ చేస్తావా? ఫస్ట్ టైం వచ్చిన ఎమ్మెల్యే లు గా ఏదేదో చేస్తున్నారు అంటూ చంద్రబాబు వైసీపీ నేతల పై రెచ్చిపోయారు. నా జీవితం లో ఎప్పుడు వెల్ లోకి వెళ్ళలేదు అని, పరిటాల రవి చనిపోయినప్పుడు కూడా వెళ్ళలేదు అని, రైతుల విషయం లో సీఎం జగన్ తీరు నచ్చక స్పీకర్ పోడియం వద్దకు వెళ్లా అని, మమ్మల్ని సస్పెండ్ చేస్తారా అంటూ చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఎంతో మంది సీఎం లను చూసా, జీవితం లో ఫస్ట్ టైం ఫేక్ సీఎం ను చూస్తున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.