జగన్ కి అవగాహన లేకపోతే పూర్తిగా తెలుసుకోవాలి – చంద్రబాబు

Sunday, November 1st, 2020, 11:00:42 PM IST

పోలవరం ప్రాజెక్టు విషయం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవగాహన లేని రాజకీయం చేస్తున్నారు అంటూ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రాజెక్ట్ విషయంలో సమస్య వచ్చినప్పుడు కేంద్రం తో మాట్లాడకుండా, లేఖ రాయడం ను తప్పుబట్టారు. సీఎం జగన్ కి అవగాహన లేకపోతే పూర్తిగా తెలుసుకోవాలి అంటూ చురకలు అంటించారు.

అయితే పోలవరం ప్రాజెక్టును టీడీపీ 71 శాతం పూర్తి చేసింది అని చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే, రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వొచ్చు అని ప్రత్యేక శ్రద్ద పెట్టిన విషయాన్ని వెల్లడించారు. అప్పటి కేంద్ర మంత్రి గడ్కారీ పోలవరం నిర్మాణం చూసి ప్రశంసించారు అని గుర్తు చేశారు. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కి అప్పగించాలని నీటి ఆయోగ్ సూచించిన విషయాన్ని వెల్లడించారు. పలువురు ఎంపీలు అడిగిన విషయానికి కేంద్ర ప్రభుత్వం ఇదే సమాధానం ఇచ్చింది అని, ఏళ్లు గడుస్తున్నా కొద్ది ప్రాజెక్ట్ వ్యయం పెరగడం సహజం అని చెప్పుకొచ్చారు చంద్రబాబు.