సంక్షేమ పాలన కి ఆద్యుడు ఎన్టీఆర్ – చంద్రబాబు

Monday, January 18th, 2021, 02:04:59 PM IST

నందమూరి తారక రామారావు 25 వ వర్ధంతి సందర్భంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. ఈ మేరకు ఎన్టీఆర్ గురించి ప్రస్తావిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు నూతన నిర్వచనం ఇచ్చి, కోట్లాది జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అంటూ కొనియాడారు. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం లో భాగస్వామ్యం కల్పించిన సమతావాది ఎన్టీఆర్ అని అన్నారు. పేదలకు ఆహార భద్రత, కట్టుకోవడానికి మంచి వస్త్రం అందించిన సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ అంటూ కొనియాడారు.

తెలుగు వారి ఆత్మ గౌరవం ను, కీర్తి ను ప్రపంచానికి చాటిన స్వర్గీయ నందమూరి తారక రామారావు మనకు దూరమై 25 సంవత్సారాలు అయినా, ఆ విశ్వ విఖ్యాతుడు మన కళ్ళ ముందే కదలాడుతూ ఉన్నట్లు ఉంది అని చంద్రబాబు నాయుడు భావోద్వగానికి గురి అయ్యారు. అయితే తెలుగు నాట రామ రాజ్యాన్ని తిరిగి నెలకొల్పడమే ఎన్టీఆర్ కి మనం అందించే అసలైన నివాళి అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించేందుకు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున హాజరు అయ్యారు. పలువురు ప్రముఖులు, నందమూరి వంశానికి చెందిన వారు ఎన్టీఆర్ కి నివాళులు అర్పించారు.