కరోనా రెండోసారి తిరగబడుతుంది – చంద్రబాబు

Friday, October 9th, 2020, 02:02:01 AM IST


తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ తీవ్రత విషయం పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ సమస్యకి ఇప్పుడు అప్పుడే పరిష్కారం లభించే సూచనలు లేవు అని తెలుస్తోంది అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అధిక జనాభా వలనే భారత్ లో ఎక్కువ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి అని అన్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలి అని, పేదల తలసరి ఆదాయం గణనీయంగా తగ్గింది అని చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే ఈ సమస్యను అధిగమించడం పెద్ద సవాల్ తో కూడుకున్నది అని తెలిపారు. అయితే కరోనా వైరస్ రెండోసారి తిరగ బడుతుంది అని అన్నారు.

అయితే రెండోసారి కరోనా వైరస్ సోకిన వారి లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి అన్ తెలిపారు. ఆసియా దేశాల్లో రెండోసారి కేసులు నమోదు అవుతున్నాయి అని, పలు దేశాలు కరోనా ను రెండు దశల్లో సమర్డం గా నియంత్రించారు అని అన్నారు. కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను క్లస్టర్స్ గా విభజించడం వలన ఈ మహమ్మారి ను అరికట్టడం సాధ్యం అయింది అని అన్నారు. అయితే కరోనా తో ప్రజలు ఇబ్బంది పడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు అని, నియంత్రణ లో విఫలం అయిన కారణం గానే పలు సమస్యలు వస్తున్నాయి అని సంచలన ఆరోపణలు చేశారు. కరోనా కేసుల విషయం లో రెండో స్థానం లో ఉన్నాం అని, మోడీ చెప్పినా వినిపించుకోడం లేదు అని తెలిపారు.