అచ్చెన్న కి కరోనా…చంద్రబాబు ఆవేదన!

Friday, August 14th, 2020, 01:15:25 AM IST


తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్న కి తాజాగా కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు అచ్చెన్న త్వరగా కరోనా వైరస్ మహమ్మారి భారీ నుండి కోలుకోవాలని వేడుకుంటున్నారు. అయితే అచ్చెన్న కి కరోనా వైరస్ సోకడం పట్ల ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. అచ్చెన్న కి కరోనా సోకడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ, చాలా బాధపడుతున్నట్లు చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

అంతేకాక త్వరగా కరోనా వైరస్ నుండి కోలుకోవాలని వేడుకుంటున్నారు. తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సైతం స్పందించారు. అచ్చెన్నకి కరోనా సోకడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ త్వరగా కోలుకోవాలని తెలిపారు. అయితే ఈ ఎస్ ఐ కుంభకోణం లో అరెస్ట్ అయిన అచ్చెన్న గుంటూరు లోని ఆసుపత్రి లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అయితే ఇపుడు అచ్చేన ఆరోగ్యం నిలకడ గానే ఉంది అని వైద్యులు అంటున్నారు.