అమరావతి దేవతల రాజధాని – చంద్రబాబు

Thursday, December 17th, 2020, 01:49:51 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే ఈ నేపథ్యం లో అక్కడ చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి దేవతల రాజధాని అని అన్నారు. అయిదు కోట్ల ప్రజల తరపున అమ్మవారిని ప్రార్థించా అని చెప్పుకొచ్చారు. అంతేకాక అమరావతి ఏకైక రాజధాని గా కొనసాగాలని కోరుకున్నా అంటూ చెప్పుకొచ్చారు. న్యాయం, ధర్మం గెలుస్తుందని విశ్వసిస్తున్నా అని చంద్రబాబు నాయుడు అన్నారు.

అయితే రాజధాని రైతులు నిర్వహిస్తున్న జయభేరి సభలో పాల్గొనడానికి వెళ్తున్న చంద్రబాబు ను పోలీసులు అడ్డుకున్నారు. అమరావతి కి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెం వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు రోడ్డుకి అడ్డంగా నిల్చుని అడ్డుకోవడం జరిగింది. అయితే తెలుగు దేశం పార్టీ సీనియర్ నేతలు అయిన అచ్చెన్న మరియు దేవినేని ఉమా లు చర్చలు జరపడం తో చంద్రబాబు ఉద్దండ రాయుని పాలెం చేరుకున్నారు.