హైకోర్ట్ లో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు

Thursday, March 18th, 2021, 12:47:31 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన అమరావతి ప్రాంతం లో భూ కుంభకోణం జరిగింది అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఎస్సీ ఎస్టీల వేధింపుల నిరోధ చట్టం కింద కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈ నెల 23 వ తేదీన విచారణ కావాల్సి ఉందని నోటీసులో పేర్కొన్నారు. సీ ఆర్ పీ సీ లోని 41(ఏ)1 ప్రకారం కింద సిఐడి నోటిసులు జారీ చేసింది. అయితే డిఎస్పీ లక్ష్మి నారాయణ పేరిట ఈ నోటీసులు జారీ అయ్యాయి. అయితే ఇందుకు కౌంటర్ గా చంద్రబాబు నాయుడు హైకోర్టు ను ఆశ్రయించారు.

సిఐడి అధికారులు నమోదు చేసిన ఎఫ్ ఐ ఆర్ ను నమోదు చేస్తూ చంద్రబాబు హైకోర్ట్ లో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. సిఐడి అధికారులు నమోదు చేసిన ఎఫ్ ఐ ఆర్ ను రద్దు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటీషన్ లో కోరడం జరిగింది. చంద్రబాబు పిటిషన్ పై రేపు హైకోర్ట్ లో విచారణ జరగనుంది. ఈ కేసు లో చంద్రబాబు ఏ 1 గా ఉండగా, ఏ 2 గా మాజీ మంత్రి నారాయణ ను పేర్కొంది. ఇతర అధికారులు సైతం నిందితులు గా ఉన్నట్లు సీఐడీ పేర్కొనడం జరిగింది.