బిగ్ న్యూస్ : భోగి రోజున జగన్ కమిటీకు దిమ్మతిరిగే షాకిచ్చిన షాకిచ్చిన చంద్రబాబు!

Tuesday, January 14th, 2020, 09:02:39 AM IST

గతంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముందు తీసుకొచ్చిన రాజధాని అమరావతి అంశాన్ని స్వాగతిస్తూ అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పుడు అధికార పక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి మాట మార్చడం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది.అక్కడ భూములు కొని చంద్రబాబు సహచరులు బాగుపడ్డారు.ఇప్పుడు తమ మనుషులు కూడా బాగుపడాలి కదా అని జగన్ రాజధాని మార్పు అంశాన్ని కోరుకున్నారు ఏమో కానీ ఇప్పుడు రాజధాని తరలింపు అంశంతో జగన్ ఏపీ ప్రజల్లో ఒక విషపు బీజం నాటిన వారయ్యారు.

ఏమన్నా అంటే తమకు వచ్చిన కమిటీల ప్రకారమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు.అయితే అసలు ఆ కమిటీలే పెద్ద బోగస్ కమిటీ అని ఇతర పార్టీల వారు విమర్శలు గుప్పిస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ రోజు బోగి పర్వదినం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి మంత్రి మరియు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు జగన్ కు మరియు అతనికి విశాఖలో రాజధాని కావాలని ఇచ్చిన జిఎన్ రావ్ కమిటీకు దిమ్మ తిరిగే షాకిచ్చారు.ఆ కమిటీ పేపర్లను తీసుకొని భోగి మంటల్లో వేసి కాల్చి వినూత్న నిరసన తెలియజేసారు.మరి దీనిపై జగన్ అండ్ కో నుంచి ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.