శాంతి భద్రతలు పరిరక్షించే విధానం ఇదేనా – చంద్రబాబు

Thursday, January 21st, 2021, 11:47:39 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పై, డీజీపీ తీరు పై తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరిగే అరచకాలు ఉన్మాది పాలన ను తలపిస్తున్నాయి అని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు పరిరక్షించే విధానం ఇదేనా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ఇందుకు డీజీపీ సమాధానం చెప్పాలి అంటూ చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. అయితే రామతీర్థం ఆలయంలో రాముడు విగ్రహం ధ్వంసం అయినప్పుడు వైసీపీ కి చెందిన ఎంపీ విజయసాయి రెడ్డి ఆలయానికి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే విజయసాయి రెడ్డి ను ఏ చట్టం కింద రామతీర్థానికి అనుమతి ఇచ్చారు అంటూ నిలదీశారు. అయితే తిరుపతి లో ధర్మ పరిరక్షణ యాత్రకి అనుమతి ఇచ్చి ఎలా రద్దు చేస్తారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాముడి విగ్రహం చేసిన అయిదు రోజుల తర్వాత రామతీర్థం వెళ్లిన విషయాన్ని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అయితే కళా వెంకట్రావు చేసిన తప్పేంటి అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే చంద్రబాబు నాయుడు ఈ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పై, డీజీపీ పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.